Komatireddy Venkat Reddy: ప్రధాని మోదీతో ముగిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

  • 10 నిమిషాల పాటు మోదీతో భేటీ
  • అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తానని సమావేశానికి ముందు చెప్పిన కోమటిరెడ్డి
  • కొంత కాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న వైనం
Komatireddy Venkat Reddy meets Modi

ప్రధాని మోదీతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల వరకు 10 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. అయితే సమావేశానికి ముందు మాట్లాడుతూ, ప్రధానిని కలవబోతుండటం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెంకటరెడ్డి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించేందుకే ప్రధానిని కలుస్తున్నానని అన్నారు. 

మూసీ నది ప్రక్షాళనకు రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని కోరనున్నట్టు చెప్పారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు ఇతర పనులకు నిధులను మంజూరు చేయాలని కోరుతానని తెలిపారు. మోదీతో సమావేశం వివరాలను మీడియాతో కోమటిరెడ్డి పంచుకునే అవకాశం ఉంది. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానితో భేటీ వెనుక మరో కోణం కూడా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

More Telugu News