విమానంలో ఇద్దరు ప్రయాణికుల పోట్లాట.. వీడియో ఇదిగో!

  • ఓ విమానంలో గొడవ పడ్డ ఇద్దరు ప్రయాణికులు
  • ‘నేను ఎవరో నీకు తెలియదంటూ’ ఓ ప్రయాణికుడి హెచ్చరిక
  • నిలువరించిన తోటి ప్రయాణికులు
Man fights with co passenger on flight in viral video

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మధ్య పోట్లాట ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం. సీటు కోసమనో, లేక మరేదో కారణం పేరుతోనో, లేక చిన్న కారణానికో కొందరు ఒకర్నొకరు తోసుకోవడం, కొట్టుకోవడం కూడా కనిపిస్తుంటుంది. ఇలాంటి సన్నివేశం విమానంలో కనిపిస్తే? చూసేవారికి ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలపైకి చేరి వైరల్ అవుతోంది.

ఏవియేటర్స్ పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో ఓ యూజర్ దీన్ని ఇతరుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ వీడియోను మెక్ ఆడమ్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి ‘ఢిల్లీ డ్యూడ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. మెక్ ఆడమ్స్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో తనను తాను పైలట్ గా పేర్కొన్నారు. ఇక ఓ ప్రయాణికుడు తన సాటి ప్రయాణికుడితో చాలా సీరియస్ గా, ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘‘నేను మాట్లాడితే ఇంకెవరూ మాట్లాడరు. నాతో ఇలా మాట్లాడకు. నేను ఎవరో నీకు తెలియదు’’ అని వార్నింగ్ ఇచ్చాడు. సదరు యువ ప్రయాణికుడిని తోటి ప్రయాణికులు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ‘వీధుల్లో జరిగే ఇలాంటి వాటిని విమానాల్లోకి తీసుకెళ్లారు’ అంటూ ఓ యూజర్ హాస్యంగా కామెంట్ చేశాడు.

More Telugu News