women cops: నెట్ లో మహిళా పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్.. వీడియో ఇదిగో! నలుగురికీ షాక్ ఇచ్చిన యూపీ ఉన్నతాధికారులు

4 UP Women Constables Suspended After Dance Video Goes Viral
  • సివిల్ డ్రెస్ లో డ్యాన్స్ చేసినప్పటికీ సస్పెండ్ చేసిన అధికారులు
  • విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోనే చర్యలంటూ వివరణ
  • అయోధ్యలోని రామ జన్మభూమి దగ్గర వారికి డ్యూటీ వేసిన ఉన్నతాధికారులు
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా బాగా చేశారని మెచ్చుకుంటూ నెటిజన్లు ఆ వీడియోను ఫార్వార్డ్ చేశారు. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు.. డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్ తో పాటు ఆ వీడియోలో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే..

అయోధ్యలోని రామ జన్మభూమి దగ్గర సెక్యూరిటీ కోసం నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు నియమించారు. ఆ నలుగురు కానిస్టేబుళ్లలో ఒకరు మంచి డ్యాన్సర్. భోజ్ పురి సాంగ్ కు ఆమె డ్యాన్స్ చేయగా మిగతా వారు చప్పట్లతో ఎంకరేజ్ చేశారు. మరో కానిస్టేబుల్ దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. 

మహిళా సిపాయిల డ్యాన్స్ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జతచేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్ తో పాటు మిగతా వాళ్లు కూడా సివిల్ డ్రెస్ లోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. నలుగురినీ సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.
women cops
up cops suspend
cops dance video viral
Uttar Pradesh
ramjanma Bhoomi

More Telugu News