వాల్తేరు వీరయ్య నుంచి కొత్త పోస్టర్.. ఈసారి స్టయిలిష్ లుక్ లో చిరు

  • జనవరి 13న విడుదల కానున్న చిత్రం 
  • పూర్తి మాస్ పాత్రలో కనిపించనున్న మెగాస్టార్
  • కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ
Presenting you all the new Avatar of our Megastar

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యువ దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి. పైగా, మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్, బాస్ పార్టీ లిరికల్ సాంగ్ తో పాటు రవితేజ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశాయి. 

తాజాగా దర్శకుడు బాబీ.. చిత్రం నుంచి మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరిపోయింది. ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు.

More Telugu News