Palvancha: పాల్వంచలో స్వల్ప భూకంపం... పరుగులు తీసిన ప్రజలు

Tremors in Palvancha
  • మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రకంపనలు
  • ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయిన వైనం
  • శబ్దాలు కూడా వచ్చాయన్న స్థానికులు
  • రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రత నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి స్వల్పంగా  కంపించడంతో పాటు శబ్దాలు కూడా రావడంతో ప్రజలు ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలకు ఇంట్లోని వస్తువులు కూడా కిందపడిపోయినట్టు స్థానికులు వెల్లడించారు. 

ఈ మధ్యాహ్నం 2.13 గంటల సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో పాల్వంచలో భయాందోళనకర పరిస్థితి నెలకొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Palvancha
Temors
Earthquake
Bhadradri Kothagudem District

More Telugu News