Sensex: అమెరికా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • 878 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 245 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 4 శాతం వరకు నష్టపోయిన టెక్ మహీంద్రా షేర్ విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఈ ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాలను కొనసాగించాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 878 పాయింట్లు కోల్పోయి 61,799కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 18,414కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం సన్ ఫార్మా (0.08%), ఎన్టీపీసీ (0.06%) మాత్రమే లాభపడ్డాయి. టాప్ లూజర్లలో టెక్ మహీంద్రా (-3.98%), ఇన్ఫోసిస్ (-2.59%), టైటాన్ (-2.57%), హెచ్డీఎఫ్సీ (-2.07%), ఐటీసీ (-1.87%) ఉన్నాయి.

More Telugu News