Jogi Ramesh: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు: ఏపీ మంత్రి జోగి రమేశ్

  • ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ విపక్షాల ప్రచారం
  • అటువంటి పరిస్థితేమీ లేదన్న మంత్రి రమేశ్
  • చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడని ఆగ్రహం
Jogi Ramesh said no early elections in state

వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటుండడం తెలిసిందే. దీనిపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితులేమీ లేవని అన్నారు. ఎన్నికల టైమ్ ప్రకారమే వస్తాయని వెల్లడించారు. టీడీపీ అంతిమదశలో ఉంది కాబట్టే ముందస్తు అంటూ చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడని జోగి రమేశ్ మండిపడ్డారు. టీడీపీ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉందని, ఇక బతికే అవకాశమే లేదని, వల్లకాడుకు పోవడమే మిగిలుందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చంద్రబాబు, లోకేశ్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు వెన్నుపోటు పాపంలో యనమల కూడా భాగస్వామి అని ఆరోపించారు. చంద్రబాబు, యనమల తమ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు.

More Telugu News