Heart: గుండె కోసం ఆరు యోగాసనాలు

  • తదాసన, అదోముఖాసన
  • శవాసన, పశ్చిమోత్తాసన
  • భుజంగాసన, సేతు బంధాసన
  • వీటిని రోజువారీ చేయడం వల్ల గుండెకు ఆరోగ్యం
Heart Health Try These 6 Yoga Asanas To Keep Your Heart Healthy

తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనం. శరీరానికి తగినంత వ్యాయామం, చురుకుదనాన్నిచ్చే పనులకు దూరం. సరైన పోషకాహారం తీసుకోకపోవడం. హాని కలిగించే జంక్ ఫుడ్, ఫ్రాసెస్డ్ ఫుడ్ ను తినడం. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గుండె జబ్బులు వచ్చిన తర్వాత వైద్యుల సూచన మేరకు జీవనశైలిలో మార్పులు, ఔషధ సేవనం చేయక తప్పదు. అదే సమయంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా చేయాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు ముందు నుంచే వీటిని చేసినట్టయితే గుండె ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవచ్చు.

తదాసన
 నిటారుగా నించుకోవాలి. రెండు చేతులను పైకి ఎత్తాలి. అలా పైకి ఎత్తిన చేతుల వేళ్లను కలపాలి. అరచేతులు సూర్యుడివైపు చూసేలా పెట్టి 10 సెకండ్లపాటు ఉంచాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చేయాలి. ఇలా 3-5 సార్లు చేస్తే చాలు. 

అదో ముఖ స్వనాసన
 ముందుకు వంగి రెండు చేతులను నేలకు అనించాలి. వీ ఆకారం పల్టీ కొడితే ఉండే మాదిరి.. మన శరీర భంగిమ ఉండాలి. నడుము భాగం మధ్యలో ఎత్తుగా ఉండాలి. పక్కన ఇమేజ్ చూసి తెలుసుకోవచ్చు. కొన్ని సెకన్ల పాటు ఇలా ఉంచితే చాలు. రోజులో 10 సార్లు ఇలా చేయాలి. 

భుజంగాసన
 చదరపు నేలపై యోగా మ్యాట్ వేసుకోవాలి. దానిపై బోర్లా పడుకోవాలి. అనంతరం రెండు చేతుల సపోర్ట్ తో నడుము నుంచి తల వరకు పై భాగాన్ని నిదానంగా పెకి ఎత్తి ఉంచాలి. 30 సెకండ్ల తర్వాత సాధారణ స్థితికి రావాలి. రోజులో ఇది 3-4 సార్లు చేయవచ్చు. 

సేతు  బంధాసన
 ఈ ఆసనంలో వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. మోకాలు నుంచి కింది వరకు కాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. రెండు చేతులను చాచి రెండు కాళ్లను పట్టుకునే విధంగా ఉంచితే సరిపోతుంది. ఇలా ఒక్కోసారి 10 సెకండ్ల పాటు 4-5 సార్లు చేయవచ్చు.


శవాసన
 చదరపు నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు చేతులు, రెండు కాళ్లను చాలా సాఫీగా, సౌకర్యంగా పెట్టుకోవాలి. కదలకుండా 20 సెకండ్లపాటు చేయాలి.

పశ్చిమోత్తాసన
 కింద కూర్చుని, రెండు కాళ్లను నిటారుగా చాచాలి. రెండు పాదాలు తలవైపు వంగి ఉండాలి. తలను క్రమ క్రమంగా పాదాల వైపునకు తీసుకెళ్లాలి. రెండు చేతులతో రెండు కాళ్లను పట్టుకుంటే సపోర్ట్ గా ఉంటుంది. దీన్ని 10-20 సెంకడ్ల పాటు చేయాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే చాలు.

More Telugu News