Balakrishna: మాస్ బీట్ తో హుషారెత్తిస్తున్న 'వీరసింహారెడ్డి'

  • రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో 'వీరసింహారెడ్డి'
  • బాలయ్య సరసన అలరించనున్న శ్రుతి హాసన్ 
  • బాలయ్య మార్క్ మాస్ బీట్ ను అందించిన తమన్ 
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల
Veera Simha Reddy lyrical song released

రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తారు. ఆ జోనర్లో ఆయన చేసిన సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. అలాంటి నేపథ్యంతో కూడుకున్న కథతో ఆయన చేసిన మరో సినిమానే 'వీరసింహారెడ్డి. మైత్రీ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి 'సుగుణ సుందరి .. సుర సుర సూపుల రాకుమారి' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'సీమా కుట్టిందే .. సిట్టి సీమా కుట్టిందే ... దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే' అంటూ, బాలయ్య - శ్రుతి హాసన్ పై చిత్రీకరించిన ఈ పాట హుషారుగా మొదలవుతోంది.

తమన్ ఈ పాటకి బాణీ కట్టగా .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. రామ్ మిర్యాల .. స్నిగ్ధ శర్మ ఈ పాటను ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాట, మాస్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News