బిగ్ బాస్: మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటికి వెళ్లేదెవరు?

  • 101వ రోజులోకి అడుగుపెట్టిన 'బిగ్ బాస్'
  • మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగ్
  • ఇంటి సభ్యులలో మొదలైన టెన్షన్ 
  • ఆడియన్స్ లో పెరుగుతున్న ఆసక్తి
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులు 101వ రోజులోకి అడుగుపెట్టారు. ఇంటి సభ్యులుగా మిగిలిన ఆరుగురి మధ్య ఇప్పుడు ఎలాంటి గేమ్స్ గానీ .. టాస్కులు గాని లేవు. బిగ్ బాస్ ఒక్కొక్కరికీ వారి జర్నీకి సంబంధించిన స్పెషల్ వీడియోను చూపిస్తూ, అభినందనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇంతవరకూ తాము చేసిన జర్నీని చూస్తూ సభ్యులు ఎమోషనల్ అవుతున్నారు. 

అయితే ఆదివారం కార్యక్రమం చివరిలో నాగార్జున మాట్లాడుతూ, ఈ వారం 'మిడ్ వీక్ ఎలిమినేషన్' ఉంటుందని చెప్పారు. ఆ ఎపిసోడ్ ఈ రోజున ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌస్ లో ఉన్న ఆరుగురిలో ఎవరు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆరుగురిలో గ్రాఫ్ తక్కువగా ఉన్నవారెవరు? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ ఆవేశపరుడే అయినా ఫిజికల్ టాస్కులలో అతనిదే పైచేయి. శ్రీహాన్ కి కాస్త వెటకారం ఎక్కువే అయినా, నిబ్బరంగా నిలబడుతూ ఉంటాడు. ఆదిరెడ్డి తనదైన విశ్లేషణతో సమయాన్ని బట్టి వెనక్కి తగ్గుతూ .. ముందుకు వెళుతున్నాడు. ఇక రోహిత్ ఆటల్లో కాస్త అలసత్వం చూపినా, ఆయన చుట్టూ ఎలాంటి వివాదాలు లేవు. ఇక శ్రీసత్య .. కీర్తి చూపుతున్న మనో నిబ్బరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాంటి ఈ ఆరుగురిలో ఎవరు బయటికి వెళతారనే విషయమే అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

More Telugu News