Pawan Kalyan: కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences  to the demise of Keeravani mother Bhanumathi
  • సంగీత దర్శకుడు కీరవాణికి మాతృవియోగం
  • అనారోగ్యంతో కీరవాణి తల్లి భానుమతి కన్నుమూత
  • విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • రేపు భానుమతి అంత్యక్రియలు
టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి తల్లి భానుమతి ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కీరవాణి మాతృమూర్తి భానుమతి గారు కన్నుమూశారని తెలిసి చింతించానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. భానుమతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భానుమతి గారి భర్త శివశక్తి దత్తా, ఆమె కుమారుడు కీరవాణి గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ వివరించారు. 

శివశక్తి దత్తా, భానుమతి దంపతులకు ఆరుగురు సంతానం. అందరిలోకి కీరవాణి పెద్దవాడు కాగా, కల్యాణ్ కోడూరి, శ్వేతనాగ, మల్లీశ్వరి, కాంచి, సప్తమి ఇతర సంతానం. 

కాగా, భానుమతి అంత్యక్రియలు రేపు హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Pawan Kalyan
Keeravani
Bhanumathi
Demise
Hyderabad

More Telugu News