Nadendla Manohar: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar met Kanna Lakshmi Narayana at his residence in Guntur
  • ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • గుంటూరులో కన్నాతో నాదెండ్ల భేటీ
  • పలు అంశాలపై చర్చ
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు గుంటూరులో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లారు. కన్నాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 

గతంలో ఏపీ బీజేపీ చీఫ్ గా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలు అని చెప్పుకుంటున్నప్పటికీ, ఇటీవల ఆ ఛాయలేవీ కనిపించడంలేదు. రెండు పార్టీలు కలిసి చేపట్టిన కార్యాచరణ ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలో, కన్నాతో నాదెండ్ల మనోహర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ జరుగుతున్న సమయంలో కన్నా మద్దతుదారులందరూ ఆయన నివాసం వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
Nadendla Manohar
Kanna Lakshminarayana
Guntur
Janasena
BJP

More Telugu News