Team India: టీమిండియా-బంగ్లాదేశ్ మొదటి టెస్టు... ముగిసిన తొలి రోజు ఆట

Team India and Bangladesh 1st test opening day play ended
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ఆట చివరికి 6 వికెట్లకు 278 పరుగులు
  • 90 పరుగులు చేసి అవుటైన పుజారా
  • 82 పరుగులతో ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్
  • 3 వికెట్లు తీసిన తైజుల్ ఇస్లామ్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటను గౌరవప్రదంగా ముగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట చివరికి 6 వికెట్లకు 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పుజారా (90) సెంచరీ మిస్సయ్యాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడి 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేశాడు. 

112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను పుజారా, శ్రేయాస్ అయ్యర్ జోడీ ఆదుకుంది. పుజారా 203 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లతో 90 పరుగులు చేసి లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ మాత్రం తన వికెట్ ను కాపాడుకున్నాడు. అయ్యర్ 169 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. 

స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. కోహ్లీని తైజుల్ ఇస్లామ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ కు 3 వికెట్లు, మెహిదీ హసన్ కు 2, ఖాలెద్ అహ్మద్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22, శుభ్ మాన్ గిల్ 20 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 14 పరుగులు చేశాడు.
Team India
Bangladesh
1st Test
Day 1

More Telugu News