సంగీత దర్శకుడు కీరవాణికి మాతృవియోగం

  • కీరవాణి తల్లి భానుమతి కన్నుమూత
  • అనారోగ్యంతో బాధపడిన భానుమతి
  • ఇంటివద్దనే చికిత్స
  • మూడ్రోజుల కిందట క్షీణించిన ఆరోగ్యం
  • కిమ్స్ ఆసుపత్రికి తరలింపు
Keeravani mother Bhanumathi passed away

టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. కీరవాణి తల్లి భానుమతి ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కీరవాణి తల్లి చాలాకాలంగా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. అయితే, మూడ్రోజుల కిందట ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

కాగా, భానుమతి భౌతికకాయాన్నిదర్శకుడు రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. పెద్దమ్మ భానుమతి అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. ఆమె కూడా రాజమౌళిని ఎంతో వాత్సల్యంతో చూసేవారని తెలుస్తోంది. కాగా, మాతృవియోగం పొందిన కీరవాణికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

More Telugu News