YS Sharmila: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన షర్మిల

Sharmila to contest from paler
  • పాలేరులో ఈ నెల 16న పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరుగుతుందన్న షర్మిల
  • పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని వెల్లడి
  • షర్మిల ఇంటి వద్ద బ్యారికేడ్లను తొలగించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిస్తూ, కొన్ని షరతులను విధించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయకూదని కండిషన్ పెట్టింది.

ఇదే సమయంలో షర్మిల ఇంటి వద్ద ఉంచిన బ్యారికేడ్లను తొలగించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు షర్మిల మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. పాలేరు పార్టీ కార్యాలయానికి ఈనెల 16న భూమి పూజ జరుగుతుందని వెల్లడించారు. పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని చెప్పారు.
YS Sharmila
YSRTP
Paler

More Telugu News