Balakrishna: ఈ థియేటర్ కు ఒక చరిత్ర ఉంది.. మాకు దేవాలయంతో సమానం: బాలకృష్ణ

Tarakarama theatre is like temple for us says Balakrishna
  • ఏసియన్ తారకరామ థియేటర్ ను ప్రారంభించిన బాలకృష్ణ
  • అమ్మానాన్నల పేర్లు కలిసొచ్చేలా 1978లో థియేటర్ ను ప్రారంభించామన్న బాలయ్య
  • తన కొడుక్కి నాన్నగారు పేరు ఇక్కడే పెట్టారని వెల్లడి
హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్ లో ఉన్న తారకరామ థియేటర్ ఈరోజు పునఃప్రారంభమయింది. ఏసియన్ తారకరామ పేరుతో కొత్త హంగులను సంతరించుకున్న ఈ థియేటర్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ థియేటర్ తమకు దేవాలయంతో సమానమని చెప్పారు. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా థియేటర్ ను నిర్మించామని తెలిపారు. 1978లో దీన్ని ప్రారంభించామని... 'సలీం అనార్కలి' సినిమాతో ఇది మొదలయిందని చెప్పారు.

కొన్ని కారణాల వల్ల గతంలో థియేటర్ మూతపడిందని, 1995లో పునఃప్రారంభించామని బాలయ్య చెప్పారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ థియేటర్ తనకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని, తన సినిమాలు ఇక్కడ ఘన విజయాలను అందుకున్నాయని చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ తారకరామ తేజ నామకరణాన్ని నాన్నగారు ఇక్కడే పెట్టారని తెలిపారు.
Balakrishna
Asian Tarakarama
Tollywood

More Telugu News