Schools: స్కూలు ఆవరణల్లో సచివాలయ నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ

High Court orders AP CS to attend hearing on December 22
  • పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు
  • హైకోర్టులో పిటిషన్లు
  • ఈ నెల 22న కోర్టుకు రావాలంటూ సీఎస్ కు హైకోర్టు ఆదేశం
ఏపీలోని పలు పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయ భవనాలు నిర్మిస్తుండడంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది. 

స్కూలు ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పిటిషనర్లు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారని వెల్లడించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం... హైకోర్టు ఆదేశించినా భవనాలు నిర్మించడంపై వివరణ ఇవ్వాలని సీఎస్ కు స్పష్టం చేసింది.
Schools
Secretariat Buildings
Rythu Bharosa Buildings
AP High Court
CS
YSRCP
Andhra Pradesh

More Telugu News