Kamal Haasan: ఫ్లాప్ లతో బాధపడుతున్న బాలీవుడ్ దర్శకులకు కీలక సూచన చేసిన కమలహాసన్

Kamal Haasan suggestion to Bollywood directors
  • ఇంగ్లీష్ సినిమాలు చూసే ముందు భారతీయ సినిమాలు చూడాలని హితవు
  • హిందీ సినిమాలతో చాలా నేర్చుకోవచ్చన్న కమల్
  • ప్రస్తుతం సూర్యుడు దక్షిణాన ప్రకాశిస్తున్నాడని వ్యాఖ్య
వరుస ఫ్లాప్ లతో బాలీవుడ్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. కొన్ని చిత్రాలు మాత్రమే పర్వాలేదనిపించాయి. ఇదే సమయంలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను దక్షిణాది చిత్రాలు షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హిట్ కావాలంటే ఏం చేయాలో బాలీవుడ్ దర్శకులకు సూచించారు. ఇంగ్లీష్ సినిమాలు చూసే ముందు భారతీయ చిత్రాలను చూడాలని హితవు పలికారు. 

హిందీ, బెంగాలీ సినిమాలను చూస్తూ చాలా విషయాలను నేర్చుకోవచ్చని చెప్పారు. హిందీ సినీ పరిశ్రమకు ఏమీ తెలియదని మీరు అనుకోవచ్చని... తాను మాత్రం హిందీ పరిశ్రమ నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సూర్యుడు దక్షిణాదిన ప్రకాశిస్తున్నాడని... అందుకే దక్షిణాది చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఈ ప్రకాశం ఇలాగే కొనసాగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
Kamal Haasan
Bollywood
Directors

More Telugu News