Rishabh Pant: వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డు

  • బంగ్లాదేశ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ లో నమోదు
  • అంతర్జాతీయ క్రికెట్లో రిషబ్ పంత్ 4,021 పరుగులు
  • ధోనీ పేరిట 17,092 పరుగుల రికార్డు
Bangladesh vs India Rishabh Pant becomes 2nd Indian wicketkeeper after MS Dhoni to score 4000 international runs

దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 4,000 పరుగులు సాధించిన రెండో భారత వికెట్ కీపర్ గా పంత్ గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్ లో స్టంపవుట్ కావడంతో వెనుదిరిగాడు.

ధోనీ రికార్డు చాలా పెద్దది. 535 అంతర్జాతీయ మ్యాచుల్లో ధోనీ 17092 పరుగులు సాధించాడు. అతడి స్ట్రయిక్ రేటు సగటు 44.74గా ఉంది. ఇందులో 15 శతకాలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రిషబ్ పంత్ ఇప్పటి వరకు 128 మ్యాచ్ లకు గాను 4021 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ సగటు 33.78గా ఉంది. కానీ, ఇందులో వికెట్ కీపర్ గా అతడు సాధించిన పరుగుల వరకే చూస్తే 109 మ్యాచుల్లో కేవలం 3,651గానే ఉంది.

More Telugu News