ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. జెండాను ఎగురవేసిన కేసీఆర్

  • కార్యాలయం వద్ద రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కేసీఆర్
  • అనంతరం జెండాను ఆవిష్కరించి, తన ఛాంబర్ లో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత
  • బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నెలకొన్న సందడి
KCR hoists BRS flag in Delhi

ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, రైతు సంఘాల నేతలు తరలి వచ్చారు. యాగం పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని తన ఛాంబర్ కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ సందడి నెలకొంది.

More Telugu News