Lionel Messi: అర్జెంటీనా తరపున నాకు ఇదే చివరి మ్యాచ్: ఫుట్ బాల్ స్టార్ మెస్సీ

This world cup final is last for me for Argentina says Lionel Messi
  • ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఫైనల్స్ కు చేరిన అర్జెంటీనా
  • ఫైనల్స్ మ్యాచ్ తో ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలుకుతానన్న మెస్సీ
  • వచ్చే వరల్డ్ కప్ వరకు తనలో శక్తి ఇలాగే ఉంటుందని అనుకోవడం లేదని వ్యాఖ్య
సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచే తన మాతృదేశం అర్జెంటీనా తరపున తాను ఆడబోయే చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు. క్రోయేషియాతో జరిగిన సెమీ ఫైనల్స్ లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ లో కూడా మెస్సీ గోల్ చేసి తన దేశ విజయంలో కీలక పాత్రను పోషించాడు. 

ఈ సందర్భంగా మీడియాతో మెస్సీ మాట్లాడుతూ... అర్జెంటీనా ఫైనల్స్ కు చేరడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ ను ఆడటం ద్వారా తన ఫుట్ బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నానని తెలిపాడు. మరో ప్రపంచకప్ కు చాలా సంవత్సరాలు పడుతుందని... అప్పటి వరకు తనలో ఇలాగే ఆడేంత సత్తా ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నాడు. తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ఇలా ముగించడమే బెస్ట్ అని చెప్పాడు.
Lionel Messi
Argentina
Football
World Cup

More Telugu News