Avanthi Srinivas: డ్వాక్రా మహిళ ఇచ్చిన సమాధానంతో షాకయిన అవంతి శ్రీనివాసరావు

Avanthi Srinivas shocked with DWCRA women answer
  • సున్నా వడ్డీని చంద్రబాబు మాఫీ చేశారా అంటూ ప్రశ్నించిన అవంతి
  • చేశారు సార్ అని సమాధానం ఇచ్చిన డ్వాక్రా మహిళ
  • సభకు వచ్చే వారికి ట్రైనింగ్ ఇవ్వాలన్న అవంతి
ఒక డ్వాక్రా మహిళ ఇచ్చిన సమాధానంతో వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్దా గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సామాజిక భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సున్నా వడ్డీ మాఫీ చేస్తానని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని... మాఫీ చేశారా? అని అక్కడున్న ఒక డ్వాక్రా మహిళను ప్రశ్నించారు. 

దీనికి సమాధానంగా ఆమె... చేశారని చెప్పింది. దీంతో, అవంతి షాక్ కు గురయ్యారు. చేయలేదు సార్ అంటూ అక్కడున్న సంబంధిత అధికారిణి చెప్పారు. దీంతో, సభకు వచ్చే డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయని చెప్పారు. రాజకీయ నేతలు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారని... పైసా సంపాదన లేకుండా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వ పథకం వస్తే అధికారులు ఎంతోకొంత ఆశపడతారని... ఇప్పుడు వారి నోరు కూడా ఎండిపోతోందని చెప్పారు.
Avanthi Srinivas
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News