health supplements: ఈ సప్లిమెంట్లతో గుండెకు రక్షణ.. అంటున్న వైద్య నిపుణులు

  • గుండెకు ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మంచివి
  • ఫోలిక్ యాసిడ్ తో స్ట్రోక్ రిస్క్ తక్కువ
  • మెగ్నీషియంతో గుండెకు భద్రత
  • విటమిన్ డీ కూడా అవసరమే
Which supplements are good for heart health which are not

గడిచిన కొన్నేళ్ల కాలంలో గుండె జబ్బుల బాధితులు గణనీయంగా పెరిగారు. మారిన జీవనశైలితో పాటు ఆహారం, వ్యాయామం లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే గుండె జబ్బులున్న వారు ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోవచ్చు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. ఆహారం విషయంలోనూ సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి వారు ఏ తరహా సప్లిమెంట్లు తీసుకుంటే ప్రయోజనం లభిస్తుందన్నది వైద్య నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం.

కార్డియో మెటబాలిక్ సమస్యలైన హార్ట్ ఎటాక్, స్ట్రోక్ తో పాటు, ఇతర జీవక్రియల సమస్యలైన మధుమేహం, నాల్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఇవన్నీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగం ఈ సవాళ్లనే ఎదుర్కొంటోంది. నిజానికి ఇవన్నీ నివారించతగ్గవే అన్నది నిజం.

వేటిల్లో ఏముంది..?

  • యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్.. గుండె జబ్బులు, టైప్-2 మధుహేహం రిస్క్ ను తగ్గిస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి.
  • శాచురేటెడ్ ఫ్యాట్, సోడియం (ఉప్పు) వీటి ముప్పును ఇంకా పెంచుతుంది. 
  • విటమిన్లు, మినరల్స్, ఒమెగా ఫ్యాటీ 3, ఒమెగా ఫ్యాటీ 6 యాసిడ్స్ గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. వీటికి ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించే శక్తి ఉంది. కనుక గుండె జబ్బుల రిస్క్ ఉండదు. 
  • ఫోలిక్ యాసిడ్ అన్నది స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది. రక్తంలో హోమోసిస్టేన్ సాంద్రతను ఫోలిక్ యాసిడ్ తగ్గిస్తుంది. 
  • ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కేవలం గుండె జబ్బులనే కాకుండా, స్ట్రోక్, లంప్స్, ఎక్జెమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. 
  • కేన్సర్ నివారణలోనూ ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పాత్ర ఉంటుందని నిపుణులు అంటున్నారు.
  • కర్కుమిన్ (పసుపు), జెనిస్టీన్, క్వెర్సెటిన్ గుండె జబ్బుల రిస్క్ ను నివారిస్తాయి. అలాగే హెచ్ బీఏ 1సీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ను తగ్గించగలవు. 
  • విటమిన్ డీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. దీనివల్ల కార్డియో మెటబాలిక్ క్రియలు మెరుగుపడతాయి. 
  • విటమిన్ ఏ, సీ, ఈ ఇవన్నీ గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించడంలో సాయపడతాయి.

ఫిష్ ఆయిల్
ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ ఫార్మసీ స్టోర్లలో లభిస్తాయి. వీటిని వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు జాన్ హాప్ కిన్ పరిశోధకులు చెబుతున్నారు. ట్రై గ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్ ను ఇవి తగ్గిస్తాయి. 500 వరకు ట్రై గ్లిజరాయిడ్స్ ఉన్న వారు ఫిష్ లివర్ ఆయిల్ క్యాప్సుల్స్ తీసుకోవడం వల్ల 30-50 శాతం వరకు తగ్గుతున్నట్టు తెలిసింది. ఏవి పడితో అవి కాకుండా వైద్యుల సూచనతో, సరైన కంపెనీవే వాడుకోవాలి. 

మా మంచి మెగ్నీషియం
మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరులో ముఖ్యపాత్ర పోషిస్తుంటుంది. గుండె అంతా కూడా కండరమయమేనన్నది అందరికీ తెలుసు. ఇది సరైన రిథమ్ లో పనిచేయడానికి, సంకోచ, వ్యాకోచాలకు మెగ్నీషియం ఎంతో కావాలి. రోజువారీగా కావాల్సినంత మెగ్నీషియం అందేలా చూసుకుంటే మంచి నిద్రతోపాటు శక్తి పెరుగుతుంది. రక్తపోటు తగ్గుతుంది. మైగ్రేయిన్ తల నొప్పులున్న వారిలోనూ మంచి ఫలితాలను చూపిస్తుంది. 

హెచ్చరిక
అధిక మోతాదులో విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం హానికరం. అలాగే క్యాల్షియం, విటమిన్ డీ అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. విటమిన్ ఏ అతిగా తీసుకున్నా రెండువైపులా పదునున్న కత్తి మాదిరిగా హాని చేస్తుంది. ప్రాణముప్పు కూడా ఉంటుంది.

More Telugu News