Twitter: మూడు రంగుల టిక్ లతో సరికొత్తగా ట్విట్టర్

Twitter brings 3 colours verification ticks
  • వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్
  • ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్
  • వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచి అందులో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ట్విట్టర్ లో ఒకే వెరిఫికేషన్ టిక్ (బ్లూ) ఉండేది. ఇప్పుడు ఈ టిక్ విషయంలో మస్క్ మార్పులు చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్ ను ట్విట్టర్ తీసుకొచ్చింది. ఈ కొత్త రంగుల వెరిఫికేషన్ టిక్ లతో ట్విట్టర్ సరికొత్తగా కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల ఎలాన్ మస్క్ స్పందిస్తూ... చాలా బోగస్ అకౌంట్లు బ్లూ టిక్ తీసుకుంటున్నాయని, వీటిని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హింసను ప్రేరేపించే ఖాతాలను మొహమాటం లేకుండా తొలగిస్తామని తెలిపారు.
Twitter
Ticks
Colour

More Telugu News