Anantapur District: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అసమ్మతి ఉంది: మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy Ramachandra Reddy Slams TDP Chief Chandrababu
  • అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
  • అసమ్మతిని పక్కనపెట్టి ప్రతి నాయకుడిని కలుపుకు పోవాలన్న మంత్రి
  • రాప్తాడు నుంచి పోటీ చేసేందుకు ఎవరు వచ్చినా పక్కకు తప్పుకుంటానన్న ఎమ్మెల్యే తోపుదుర్తి
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల అసమ్మతి ఉందని, ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నియోజకర్గంతోపాటు తనకు కూడా అసమ్మతి ఉందని అన్నారు. అనంతపురంలోని ఓ ఫంక్షన్ హాలులో నిన్న రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అయిన పెద్దిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసమ్మతిని పక్కనపెట్టి ప్రతి నాయకుడిని కలుపుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పత్రికలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా సరే ఈ స్థానంలోకి వచ్చి పోరాటం చేస్తామంటే పక్కన కూర్చుని మద్దతు ఇస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు సీటును ఇతరులకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Anantapur District
Raptadu
YSRCP
Thopudurthi Prakash Reddy
Peddireddy Ramachandra Reddy

More Telugu News