Chiranjeevi: పూనకాలు డబుల్.. వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ గా​ రవితేజ.. అదిరిన ఫస్ట్ లుక్

Mass Maharaja Ravi Teja First look Teaser in Waltair Veerayya  release
  • మాస్ మహారాజా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన చిరంజీవి
  • ఫుల్ మాస్ యాక్షన్ లో రవితేజ
  • జనవరి 13న విడుదల కానున్న చిత్రం
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న పూర్తి స్థాయి మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటిస్తున్నారు. దాంతో, అటు మెగా ఫ్యాన్స్ తో పాటు రవితేజ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మెగా మాస్ సాంగ్ అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు సినిమాలో రవితేజ పాత్రను చిరంజీవి పరిచయం చేశారు. ‘అతని బ్యాక్ గ్రౌండ్ కేవలం హార్డ్ వర్క్. అతని సపోర్ట్– ప్రేమించే మాస్’ అంటూ ట్విట్టర్ లో కొనియాడారు. 

మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర ఫస్ట్ లుక్ తో పాటు ఆయన పాత్రను పరిచయం చేసే టీజర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఓ చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలి పట్టుకొని విలన్లతో ఫైట్ చేస్తూ రవితేజ పుల్ యాక్షన్ లో మోడ్ లో కనిపించారు. ‘ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తాంది’ అంటూ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది.  ‘ఏమిరా వారి పిస పిస జేస్తున్నవ్. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వని అయ్యకీ ఇననని’ అంటూ తెలంగాణ యాసలో రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. రవితేజ పాత్రను చూశాక ఈ చిత్రంతో పూనకాలు డబుల్ అవడం ఖాయం అనిపిస్తోంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
.
Chiranjeevi
Raviteja
teaser
Waltair Veerayya

More Telugu News