Cancer: కేన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయ్.. స్వయంగా బాధితులు వెల్లడించిన విషయాలు

  • నొప్పి విడవకుండా ఏదైనా భాగంలో వస్తుంటే నిర్లక్ష్యం వద్దు
  • మల, మూత్రాల్లో రక్తం కనిపించడమూ మంచి సంకేతం కాదు
  • అంతుబట్టని సమస్య కనిపిస్తే అన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందే
Cancer survivors share symptoms they noticed before diagnosis

కేన్సర్ ప్రాణాంతక మహమ్మారి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఈ మహమ్మారి ఎక్కువ మంది శరీరాల్లోకి చొరబడుతుండడమే ఇప్పుడు ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. చిన్న గడ్డ, చిన్న నొప్పితోనే కేన్సర్ మొదలవుతుంది. తొలినాళ్లలో గుర్తించడం ఒక్కటే దీన్నుంచి బయటపడేందుకు మెరుగైన మార్గం అవుతుంది. శరీరంలోని ఒకటి లేదా ఒకటికి మించిన ప్రాంతాల్లో ఈ మహమ్మారి విస్తరించిన తర్వాత గుర్తించడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. చిన్న గడ్డ, చిన్న నొప్పిని చాలా మంది సాధారణమేనని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నొప్పి అతి సాధారణమైన లక్షణం కనుక. గుర్తించలేని తనం ఒక్కటే కేన్సర్ విస్తరించేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని తెలుసుకోవాలి. 

‘‘నేను పుట్టిన నాటి నుంచి నాకు స్పైనల్ కార్డ్ కేన్సర్ ఉందని బయటపడింది. గడ్డ పెద్దది అయి, నేను కదల్లేని స్థితికి వచ్చే వరకు ఇది కేన్సర్ అని తెలియదు’’ అని క్వోరా అనే ఆన్ లైన్ ఫోరమ్ లో కిస్టా అనే యూజర్ రాసుకొచ్చారు. నేను చిన్నతనంలో చాలా అస్థిరంగా, నియంత్రణ లేకుండా ఉండే దానిని. నా తల్లిదండ్రులు నన్ను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ‘బాగానే ఉన్నట్టు, ప్రతి చిన్నారి భిన్నంగా ఎదుగుతారు’’ అని నా తల్లిదండ్రులకు చెప్పి పంపించేశారు.

కేన్సర్ గురించి నాకు గుర్తున్న తొలి అనుభవం. అమ్మమ్మ ఇంట్లో ఓ ఆభరణం చెట్టు కొమ్మకు చిక్కుకుంది. దాన్ని చూసిన తర్వాత నా మెడ నొప్పిగా ఉందని చెప్పాను. చివరిగా నన్ను పిల్లల హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నా వెన్నెముకలో ట్యూమర్ గుర్తించారు. అదృష్టవశాత్తూ అది ఇతర భాగాలకు ఇంకా విస్తరించలేదు. దాంతో దాన్నుంచి నేను బయటకు వచ్చాను’’ అని వివరించింది.

పాంక్రియాటిక్ కేన్సర్ బాధితుడి భార్య పోస్ట్
‘‘నా భర్త చాలా జోవియల్ గా సరదాగా సాగిపోయే వ్యక్తి. ఉన్నట్టుండి అతడి ప్రవర్తనలో మార్పు కనిపించింది. మాట్లాడితే ఆవేశపడిపోవడం కనిపించింది. అది కూడా కేవలం ఇంట్లో నాపట్ల, టీనేజ్ లో ఉన్న పిల్లల పట్లే. మేము వివాహ కౌన్సిలర్ వద్దకు వెళ్లాం. అతడితో కలసి ఉండడం క్షేమకరం కాదని కౌన్సిలర్ చెప్పాడు. 11 నెలల పాటు విపరీత ప్రవర్తన తర్వాత నా భర్తకు పాంక్రియాటిక్ కేన్సర్ బయటపడింది’’ అని చెర్రీ అనే మహిళ పోస్ట్ పెట్టారు.

ఛాతీ మధ్య భాగంలో కొద్దిగా వస్తున్న నొప్పిని నిర్లక్ష్యం చేయగా, తర్వాత అది థైమిక్ కార్సినోమా అని బయటపడినట్టు మరో యూజర్ వెల్లడించారు. ఛాతీ మధ్య భాగంగాలో స్వల్ప నొప్పి వస్తూపోతుండేది. కొన్నినెలల తర్వాత ఆందోళన ఎక్కువ కావడంతో దీనిపై డాక్టర్ కు మెయిల్ పెట్టాను. ఎక్స్ రే, రక్త పరీక్షలను సూచించారు. పరీక్షలు చేయించి రిపోర్ట్ లు మెయిల్ లో పంపించాను. అవి చూసిన డాక్టర్ హార్ట్ ఎటాక్ సూచనలు ఏవీ లేవని, ఎక్స్ రేలోనూ ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదన్నారు. 

ఒక నెల తర్వాత నొప్పి కారణంగా నేను రాత్రంగా నిద్రపోలేకపోయాను. ఆ నొప్పి మరింత తీవ్ర రూపం దాల్చింది. మరుసటి రోజు ఆఫీస్ కు వెళుతూ  అత్యవసర వైద్య విభాగాన్ని సంప్రదించాను. వారు మరిన్ని ఎక్స్ రేలు, రక్త పరీక్షలు చేయించారు. హార్ట్ ఎటాక్ సూచనలు ఏవీ లేవంటూ, ఛాతీ భాగంలో చిన్న గడ్డ ఉన్నట్టు చెప్పారు. దాన్ని బయాప్సీ కోసం పంపించారు. కరోనా తో దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండడం వల్ల ఆ తర్వాత రెండు నెలలకు గాను బయాప్సీ రిపోర్ట్ నాకు చేరలేదు. చివరిగా ఆంకాలజిస్ట్ నాకు కాల్ చేసి థైమిక్ కార్సినోమా అని చెప్పారు. ఎడమ చేతి ఊపిరితిత్తుల వద్ద ఉందని, అక్కడి నుంచి లింఫ్ నోడ్స్ కు చేరినట్టు, అత్యవసర వైద్యం అవసరమని చెప్పారు. 

నీళ్ల విరేచనాలు మూడు వారాలుగా అవుతున్నా, మూత్రంలో రక్తం కనిపించినా అది కేన్సర్ సంకేతమేనని డాక్టర్ హిలారీ జోన్స్ అంటున్నారు. బ్లాడర్ కేన్సర్ లో మూత్రంలో రక్తం కనిపిస్తుందని చెప్పారు.

More Telugu News