ఆహారంలో తలవెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండుకొట్టించాడు!
- ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఘటన
- కుటుంబ సభ్యుల ముందే భార్యకు గుండుకొట్టించిన భర్త
- బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
ఈ అవమానాన్ని భరించలేని సీమాదేవి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని తనకు గుండుకొట్టించాడని, అంతేకాకుండా రూ. 15 లక్షల కట్నం తీసుకురావాలని పెళ్లయినప్పటి నుంచి అత్తింటివారు వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జహీరుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.