Visakhapatnam: జగన్‌ను ఓడించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది: బొత్స

There is Conspiracy in AP To Defeat Jagan Says Botsa
  • విజయనగరంలో వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం
  • విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీర్మానం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖ పరిపాలన రాజధాని అన్న వైవీ
వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో నిన్న జరిగిన వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీలో భాగంగా చేపట్టిన నాన్ ప్రయారిటీ పనుల పెండింగ్ బిల్లుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఇదే సమావేశంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని అన్నారు.

వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని అంటున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. అయితే, అమరావతిలో కొన్న భూముల ధరలు పడిపోతాయన్న భయంతో, వారి సామాజిక వర్గ అభివృద్ధి కోసం కొందరు అక్కడే రాజధాని కావాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీర్మానించారు.
Visakhapatnam
YV Subba Reddy
Botsa Satyanarayana
Amaravati
Vizianagaram

More Telugu News