Team India: బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు జట్టులో మార్పులు చేసిన బీసీసీఐ

BCCI announces changes in Team India for test series with Bangladesh
  • ఈ నెల 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్
  • షమీ, జడేజా, రోహిత్ శర్మలకు గాయాలు
  • అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, సైనీ ఎంపిక
  • అదనంగా జయదేవ్ ఉనద్కట్ ఎంపిక 
ఈ నెల 14 నుంచి టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే, టీమిండియాలో పలువురు ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో, బీసీసీఐ జట్టులో మార్పులు చేసింది. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయాలతో టెస్టు సిరీస్ కు ఇప్పటికే దూరం కాగా, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడిన రోహిత్ శర్మ కూడా తొలి టెస్టులో ఆడడంలేదు. 

గాయపడిన ఆటగాళ్ల స్థానంలో బీసీసీఐ అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను ఎంపిక చేసింది. అదనంగా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. రోహిత్ శర్మ గైర్హాజరీతో తొలి టెస్టులో టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు.
Team India
Injuries
BCCI
Test Series
Bangladesh

More Telugu News