Andhra Pradesh: విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన వారి స్థానికత పదేళ్లకు పొడిగింపు... రాష్ట్రపతి ఉత్తర్వులు

  • 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన
  • ఏపీకి వచ్చిన వారికి విద్య, ఉద్యోగాలపై ఏడేళ్ల స్థానికత
  • అప్పటి రాష్ట్రపతి ఆదేశాలు
  • ముగిసిన ఏడేళ్ల గడువు
  • మరో మూడేళ్లకు గడువు పెంచాలన్న ప్రభుత్వం
President Murmu extends local status for who came to AP from TS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారి స్థానికతను పదేళ్లకు పొడిగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజా ఉత్తర్వులు జారీ చేశారు. విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచ్చిన వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఏడేళ్ల పాటు స్థానికతను కల్పించారు. ఆ మేరకు 2014లో అప్పటి రాష్ట్రపతి ఆదేశాలు ఇచ్చారు. 

అయితే ఏడేళ్ల గడువు పూర్తి కావడంతో, స్థానికతను మరో మూడేళ్లు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఆదేశాల్లో సవరణలు చేశారు. మరో మూడేళ్ల పాటు స్థానికత అమల్లో ఉండేలా తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

More Telugu News