జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 12న విడుదల

  • మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు
  • ఓ ప్రకటనలో వెల్లడించిన టీటీడీ
  • డిసెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు
TTD says Srivari Arjita seva tickets will be available on December

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 14న ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. అనంతరం లక్కీ డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుందని టీటీడీ పేర్కొంది.

More Telugu News