Posts: తెలంగాణ పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం

Telangana cabinet approves new posts in police dept
  • కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
  • సైబర్ సేఫ్టీ బ్యూరోలో పోస్టులు
  • రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు
  • డ్రగ్స్ నేరాల కట్టడికి ప్రత్యేక విభాగం
తెలంగాణలో మరోసారి కొలువుల జాతరకు తెర లేస్తోంది. రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం లభించింది. పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ సేఫ్టీ బ్యూరోలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాదు, డ్రగ్స్ నేరాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Posts
Police
Cyber Safety Bureau
Telangana Cabinet
Telangana

More Telugu News