Simboo: భారీ ప్రాజెక్టును లైన్లో పెట్టిన మురుగదాస్!

Simboo in Murugadoss Movie
  • 'దర్బార్' తరువాత గ్యాప్ తీసుకున్న మురుగదాస్ 
  • నెక్స్ట్ మూవీ హీరోగా వినిపిస్తున్న శింబు పేరు 
  •  నిర్మాణ సంస్థగా హోంబలే ఫిలిమ్స్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందంటూ టాక్   
శంకర్ తరువాత కోలీవుడ్ సినిమాను ప్రభావితం చేసిన దర్శకుడిగా మురుగదాస్ కి పేరు ఉంది. ఒకానొక దశలో మురుగదాస్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ బడా హీరోలు సైతం లైన్లో ఉన్నారు. కథ .. కథనం .. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో మురుగదాస్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఆయనను స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఆయన కథలను రీమేక్ చేసేవారు ఆ కథలలో ఎంత మాత్రం మార్పులు చేయలేకపోయారు అది ఆయన గొప్పతనం. 

అలాంటి మురుగదాస్ కి 'దర్బార్' తరువాత గ్యాప్ వచ్చింది. రజనీతో చేసిన ఆ సినిమా తరువాత ఆయన కొన్ని ప్రాజెక్టులు అనుకుంటే అవి కాస్తా చివరి నిమిషంలో అటకెక్కాయి. అందువలన ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. మురుగదాస్ అభిమానులంతా కూడా ఆయన నెక్స్ట్ మూవీ హీరో ఎవరా అనే కుతూహలంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మురుగదాస్ తదుపరి సినిమా హీరోగా 'శింబు' పేరు వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో శింబు తన కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టాడు. వివాదాలకు దూరంగా ఉంటూ వెంటవెంటనే కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అలా మురుగదాస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ జోరు నడుస్తున్న ఈ సమయంలో మురుగదాస్ మరోసారి తన మార్క్ వేస్తాడేమో చూడాలి మరి.
Simboo
Murugadoss
Movie

More Telugu News