manneguda kidnap: ఆమె ఇష్టంతో వస్తే.. కోడలుగా అంగీకరిస్తా..: కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ తల్లి

we are ready to accept her as our daughter in law says naveen reddy mother
  • గతంలో నవీన్ చాలాసార్లు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడన్న నవీన్ తల్లి 
  • ఇప్పుడు వాళ్ల కుటుంబం మారిపోయిందని ఆరోపణ
  • కూతురుకు ఫారెన్ సంబంధం చూస్తున్నారని విమర్శ
నవీన్ రెడ్డి, ఆ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని నవీన్ రెడ్డి తల్లి మీడియాకు వెల్లడించారు. ఇద్దరూ భార్యాభర్తలుగానే తిరిగారని వివరించారు. ఆమెను పెళ్లి చేసుకున్నానని తన కొడుకు చెప్పాడని, తను మాత్రం ఆ పెళ్లి చూడలేదని పేర్కొన్నారు. గతంలో చాలాసార్లు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడని తెలిపారు. 

ఇద్దరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు మొదట ఒప్పుకున్నారని, పెళ్లి చేయాలని కూడా అనుకున్నట్లు వివరించారు. అయితే, ఇటీవల ఏం జరిగిందో కానీ యువతి కుటుంబం మారిపోయిందని ఆరోపించారు. ఆమెకు విదేశీ సంబంధం చేయాలని ఆ కుటుంబం చూస్తున్నట్లు తన కొడుకు చెప్పాడన్నారు. 

దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొన్ని రోజులు ఎక్కడన్నా ఉందామని, పెళ్లి చేస్తామని మాటిస్తేనే తిరిగొద్దామని యువతి అంటోందని కూడా నవీన్ తనకు చెప్పాడన్నారు. అయితే, ఈలోపే యువతిపై ఆమె కుటుంబం ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇంట్లో బంధించి, తాము చెప్పిన మాట వినాలని బెదిరించారని నవీన్ తల్లి ఆరోపించారు. నవీన్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరించారని చెప్పారు. యువతిపై తమకెలాంటి కోపంలేదని, ఇష్టంతో వస్తే ఆమెను కోడలిగా ఆదరిస్తానని ఆమె స్పష్టంచేశారు.
manneguda kidnap
naveen reddy
naveen mother

More Telugu News