Vivo: త్వరలోనే భారత మార్కెట్లోకి వివో ప్రీమియం ఫోన్ ఎక్స్ 90

  • భారతీయ ప్రమాణాల సంస్థ వద్ద దరఖాస్తు
  • వీ2218 మోడల్ నంబర్ తో పోర్టల్ లో దర్శనం
  • సుమారు రూ.45వేల నుంచి ధరలు ప్రారంభం
Vivo X90 series to launch in India likely to feature MediaTek Dimensity 9200 chipset

వివో తన ఫ్లాగ్ షిప్ ప్రీమియం ఫోన్ అయిన ఎక్స్ 90ని త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. చైనాలో ఇటీవలే ఎక్స్90 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. తాజాగా భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) వెబ్ సైట్ లో వివో ఎక్స్90 దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోన్ ను ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తేలిపోయింది. బీఐఎస్ వద్ద అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. బీఐఎస్ పోర్టల్ లో వీ2218 మోడల్ నంబర్ తో ఈ ఫోన్ నమోదైంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరే ఇతర వివరాలు అక్కడ లేవు.

చైనాలో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్ 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర 3,699 యువాన్లు. మన కరెన్సీలో రూ.42,400. ఇక వివో ఎక్స్ 90 ప్రో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ధర చైనాలో 4,999 యువాన్లు. రూపాయిల్లోకి మారిస్తే రూ.57,200. 12 జీబీ వేరియంట్ ఎక్స్ 90 ప్రో ధర మన రూపాయిల్లో రూ.74,400గా ఉంది. మన దగ్గర వీటి ధరలు రూ.45-50వేల స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్ 90 ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్, 120 హెర్జ్ డిస్ ప్లే, మీడియాటెక్ డెమెన్సిటీ 9200 చిప్ సెట్, 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ సోనీ కెమెరా సెన్సార్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజర్, 12 మెగాపిక్సల్ పోట్రయిట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

వివో 90 ప్రో ఫోన్ లోనూ 6.78 అంగుళాల డిస్ ప్లే, 2కే రిజల్యూషన్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 4,870 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ చార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 866 కెమెరా సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంటుంది.

More Telugu News