ycp: వైసీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ప్రొఫైల్ పిక్ ను మార్చేసిన హ్యాకర్లు

  • ప్రొఫైల్ పిక్, బయోడేటా మార్చేసిన హ్యాకర్లు
  • క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టిన వైనం
  • శుక్రవారం అర్ధరాత్రి నుంచి మారిన ప్రొఫైల్
  • పునరుద్ధరించేందుకు పార్టీ సాంకేతిక సిబ్బంది ప్రయత్నాలు
ysrcp twitter handle hacked

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పార్టీ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ ను హ్యాకర్లు మార్చేశారు. ఆపై ఇందులో క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్ తో పాటు బయోడేటా వివరాలను మార్చేశారు. ఖాతాను పునరుద్ధరించేందుకు వైసీపీకి చెందిన సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి వైసీపీ ట్విట్టర్ ఖాతాలో పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని పోస్టులు వెలువడ్డాయి. క్రిప్టోకు సంబంధించిన పలు ట్వీట్లు పార్టీ ఖాతాలో ప్రత్యక్షమయ్యాయి. పార్టీ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు.. క్రిప్టోకు సంబంధించిన సమాచారాన్ని రీ ట్వీట్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఎన్‌ఎఫ్‌టీలు ఫ్రీగా ఇస్తున్నారని రీ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ ఎకౌంట్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంచేసి, బయోను మాత్రం ఎన్ ఎఫ్టీ మిలియనీర్, అమెరికా అని మార్చేశారు. కాగా, పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడం గతంలోనూ జరిగింది. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా రెండుసార్లు హ్యాక్ అయింది.

More Telugu News