పవన్ వాహనం పేరు వారాహి కాదు.. నారాహి అంటే సరిపోతుంది: జోగి రమేశ్ సెటైర్

  • పవన్ బస్సు యాత్ర కోసం ప్రత్యేక వాహనం
  • ఆలివ్ గ్రీన్ రంగుపై విమర్శలు
  • నిబంధనలకు వ్యతిరేకం అంటున్న వైసీపీ నేతలు
  • పవన్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపడుతుండడం తెలిసిందే. అయితే పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు, పవన్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 

తాజాగా, వైసీపీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వాహనం పేరు వారాహి కాదు నారాహి అంటే సరిపోతుందని సెటైర్ వేశారు. చంద్రబాబుకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే ఉంటారని చెప్పమనండి, లేకపోతే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులే ఉంటారని, తానే సీఎం అభ్యర్థినని పవన్ కల్యాణ్ చెప్పగలడా? అని జోగి రమేశ్ నిలదీశారు. పవన్ ఒక పగటి వేషగాడు అని, చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధంగా ఉంటాడు అని విమర్శించారు.

More Telugu News