ఈ నెల 12న 'వాల్తేరు వీరయ్య' నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య
  • నేడు రవితేజ ప్రీ లుక్ పంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్
  • ఒక చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలితో మాస్ మహారాజా
  • ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Ravi Teja first look teaser will be out now on December 12

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో చిత్రబృందం నుంచి అప్ డేట్ వెలువడింది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.07 గంటలకు వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు రవితేజ ప్రీ లుక్ ను పంచుకుంది. ఒక చేతిలో మేకపిల్ల, మరో చేత్తో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ను లాక్కొస్తున్న రవితేజ ప్రీ లుక్ చూస్తుంటే ఫస్ట్ లుక్ టీజర్ పై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. 

వాల్తేరు వీరయ్య చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతిహాసన్, కేథరిన్ ట్రెసా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మెగా మాస్ ఎంటర్టయినర్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

More Telugu News