YS Sharmila: ట్యాంక్ బండ్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన షర్మిల

YS Sharmil hunger strike
  • పాదయాత్రకు అనుమతించకపోవడంతో నిరాహారదీక్ష
  • అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష
  • న్యాయస్థానాన్ని కేసీఆర్ అగౌరవపరుస్తున్నారని మండిపాటు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆమరణదీక్షకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె దీక్షకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.  

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. తన పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. తన పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ కూడా ఉందని... అయినప్పటికీ కేసీఆర్ న్యాయస్థానాన్ని కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. తాను పాదయాత్ర చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అంటే భయం లేకపోతే పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. ఇప్పటికే 85కు పైగా నియోజకవర్గాలను దాటొచ్చామని... ఇప్పుడు తమకు అడుగడుగునా ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆపడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగునా? అని షర్మిల ప్రశ్నించారు.
YS Sharmila
Hunger Strike
YSRTP

More Telugu News