బంగ్లాదేశ్ తో చివరి వన్డే కోసం భారత జట్టులో కీలక మార్పులు

  • బొటన వేలికి గాయం వల్ల ముంబై ప్రయాణమైన రోహిత్
  • చివరి వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్
  • చాహర్, సేన్ సైతం గాయాలవల్ల దూరం
  • కులదీప్ యాదవ్ కు చోటు
Kuldeep Yadav returns BCCI names revised squad for 3rd ODI vs Bangladesh after Rohit Chahar Sen ruled out out

వరుస ఓటములు, ఆటగాళ్ల గాయాలతో.. బంగ్లాదేశ్ తో చివరి వన్డేలో భారత జట్టులో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఆడలేని పరిస్థితి నెలకొనడంతో, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. దీపక్ చాహర్, కులదీప్ సేన్ కూడా గాయాల వల్ల మూడో వన్డేకు దూరమయ్యారు. 

యూపీ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు మూడో వన్డే స్క్వాడ్ లో చోటు లభించింది. న్యూజిలాండ్ సిరీస్ లోనూ కుల్దీప్ కు చోటు ఇచ్చినా, ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లకు రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది తర్వాత నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. రెండో వన్డేలో రోహిత్ బొటనవేలికి గాయం అయిన విషయాన్ని ప్రస్తావించింది. ఢాకాలో ఒక స్థానిక హాస్పిటల్ లో రోహిత్ కు స్కానింగ్, ఇతర పరీక్షలు చేయించిన అనంతరం.. స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం రోహిత్ ముంబైకి ప్రయాణమైనట్టు వెల్లడించింది. దీంతో అతను చివరి వన్డేకు అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ తెలిపింది. తొడలో గాయం తిరగబెట్టడంతో చాహర్, వెన్నునొప్పి కారణంగా కులదీప్ సేన్ అందుబాటులో లేకుండా పోయినట్టు పేర్కొంది.

More Telugu News