భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం.. టీఆర్ఎస్ జెండాకు, బీఆర్ఎస్ జెండాకు మధ్య ఉన్న తేడాలు ఇవే!

  • ఈసీ లేఖపై సంతకం చేసిన కేసీఆర్
  • తెలంగాణ పటం స్థానంలో భారతదేశ చిత్రపటం 
  • జై తెలంగాణకు బదులుగా జై భారత్ నినాదం  
  • కార్యక్రమానికి హాజరైన కుమారస్వామి, ప్రకాశ్ రాజ్
TRS became BRS

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా ముహూర్త సమయమైన 1.20 నిమిషాలకు ఈసీ లేఖపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంతకం చేశారు. బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జెండా కూడా గులాబీ రంగులోనే ఉంది. జెండాలో తెలంగాణ పటం స్థానంలో భారతదేశ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణకు బదులుగా జై భారత్ అని పేర్కొన్నారు. జెండాలో కారు గుర్తు కనిపించలేదు. 

మరోవైపు ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వీరితో పాటు టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు. ఈ క్షణం నుంచి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. బీఆర్ఎస్ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

More Telugu News