animal: జంతువుల్లా కనిపిస్తారు.. కానీ మనుషులే.. ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో ఇదిగో!

Is that an animal or a person Anand Mahindra post will leave you thoroughly amazed Watch
  • పక్షులు, సింహం, పులిగా మారిపోయిన మనుషులు
  • శరీరంపై పెయింట్ వేసుకుని వాటిని మరిపించే విధంగా భంగిమలు
  • ట్విట్టర్ లో షేర్ చేసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్
ట్విట్టర్ లో కోటి మందికి పైగా ఫాలోవర్స్ కలిగిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. తనను అనుసరించే వారి ముందుకు మరో ప్రత్యేకమైన వీడియోతో వచ్చారు. తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో అద్భుత కళలు ఉన్నాయన్నది నిజం. ఈ వీడియోలో కూడా అలాంటి కళను ప్రదర్శించే కళాకారుల నైపుణ్యాలకు ఎవరైనా ముచ్చట పడాల్సిందే

శరీరంపై జంతు ఆకారాలను పెయింట్ గా వేసుకుని.. శరీర అవయవాలను  పక్షులు, జంతువుల మాదిరి ఆకారంలోకి వంపు చేసి...  అచ్చం పక్షి లేదా జంతువు అని భ్రమ పడేలా చేయడం సాధారణమైనది కాదు. ఓ టాలెంట్ హంట్ షోలో భాగంగా కళాకారులు ఈ విన్యాసాలు చేశారు. ‘‘అద్భుతం.. శుక్రవారం అడవిలో ఉన్నట్టుంది. చివరి దాని కోసం వేచి చూడండి’’ అని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు. వీడియో చివర్లో పెద్ద పులి దర్శనమిస్తుంది. అది కూడా ఓ కళాకారుడి కృషి అని తెలుస్తుంది. ఇప్పటికే దీన్ని 4 లక్షల మందికి పైగా వీక్షించారు.
animal
person
looks like animals
Anand Mahindra
vedio

More Telugu News