JD Lakshmi Narayana: వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

It will be better if AP and Telangana unites says JD Lakshmi Narayana
  • తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానన్న లక్ష్మీనారాయణ 
  • ఏపీ, తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని వెల్లడి  
  • రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్య
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు.
JD Lakshmi Narayana
Andhra Pradesh
Telangana

More Telugu News