Disneyland trip: ఎంత మంచి బాసో.. 10 వేల ఉద్యోగుల కుటుంబాలకు డిస్నీల్యాండ్ ట్రిప్

Billionaire CEO arranges for 3 day Disneyland trip for 10000 staff and their families
  • డిస్నీల్యాండ్ చేరుకునేందుకు ఉచితంగా ఫ్లయిట్ టికెట్లు
  • పర్యటన సమయంలో అన్ని సదుపాయాలూ ఉచితమే
  • సిటాడెల్ ఫౌండర్, సీఈవో గ్రిఫిన్ నిర్ణయాలు
సిటాడెల్ ఉద్యోగులు ఇప్పుడు తమ సంస్థ సీఈవో చేసిన పనితో ఎంతో సంబరపడుతున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కెన్ గ్రిఫిన్ కంపెనీలో పనిచేసే 10,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డిస్నీల్యాండ్ లో మూడు రోజుల పర్యటన విడిది ట్రిప్ ఉచితంగా ఏర్పాటు చేశారు. ఉద్యోగులు నివసించే ప్రాంతం నుంచి ఫ్లోరిడాలోని డిస్నీల్యాండ్ చేరుకోవడానికి ఫ్లయిట్ టికెట్లను కూడా గ్రిఫిన్ సమకూర్చారు. 

ఉద్యోగులు కంపెనీకి అందిస్తున్న సేవలను ఆయన ఈ విధంగా గుర్తించి, గౌరవించినట్టయింది. పర్యటన సందర్భంగా భోజనాలు, టిఫిన్లు, ఇతరత్రా రూపాయి కూడా ఖర్చు కాకుండా మొత్తం సిటాడెల్ కంపెనీయే భరించింది. ‘‘చరిత్రలోనే కాకుండా, ఫైనాన్స్ చరిత్రలోనూ ఎంతో అసాధారణ టీమ్ ను మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ముందు ఎంతో అద్భుత భవిష్యత్తు ఉంది. కొత్త అధ్యాయాలను లిఖించేందుకు చూస్తున్నాను’’ అంటూ ఉద్యోగులకు గ్రిఫిన్ సందేశం ఇచ్చారు. గ్రిఫిన్ 31.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 40వ అత్యంత సంపన్నుడిగా ఉన్నట్టు ఫోర్బ్స్ జాబితా తెలియజేస్తోంది. 

Disneyland trip
free
10000 staff
citadel ceo

More Telugu News