క్రికెటర్లు ఉన్న హోటల్ సమీపంలో కాల్పుల కలకలం.. జట్టుకు భద్రత కట్టుదిట్టం
- ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు
- గురువారం స్థానిక గ్రూపుల మధ్య కాల్పులు జరగడంతో ఆ జట్టుకు భద్రత పెంపు
- ముల్తాన్ లో నేటి నుంచి పాక్ తో రెండో టెస్టు
దీంతో, వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో తుపాకీ కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల ఘటన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియంకు వెళ్లేదారిలో ఇతర వాహనాలను అనుమతించలేదు.
మరోవైపు ఈ ఘటన ఇంగ్లండ్ జట్టును పెద్దగా ప్రభావితం చేయలేదు. శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టు కోసం ఆటగాళ్లు యథావిధిగా ప్రాక్టీస్ చేశారు. కాగా, 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న సందర్భంలో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణించిన లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. దాంతో పలు జట్లు చాలా కాలం పాటు పాకిస్థాన్ వచ్చేందుకు నిరాకరించాయి.