స్పీడ్ పెంచుతున్న రాజశేఖర్ కూతుళ్లు!

  • నటన దిశగా కూతుళ్లను ప్రోత్సహిస్తున్న రాజశేఖర్ 
  • శివాత్మిక నటించిన 'పంచతంత్రం' రేపే విడుదల 
  • శివాని చేసిన 'విద్య వాసుల అహం' సంక్రాంతికి రిలీజ్ 
  • వెబ్ సిరీస్ పట్ల ఉత్సాహం చూపుతున్న అక్కాచెల్లెళ్లు
Shivani and Shivathmika Special

ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి హీరోలే తప్ప .. హీరోయిన్స్ వచ్చేవారు కాదు. ఒకవేళ తన కూతురును హీరోయిన్ గా చేయాలని హీరోకి ఉన్నప్పటికీ అభిమానులు అందుకు ఒప్పుకునేవారు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తమకి ఆసక్తి ఉంటే స్టార్ హీరోల కూతుళ్లు కూడా కెమెరా ముందుకు వస్తున్నారు. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 

కమల్ కూతురు శ్రుతి హాసన్ .. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇక అర్జున్ కూడా తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అటు కోలీవుడ్ తోను .. ఇటు టాలీవుడ్ తోను మంచి అనుబంధం ఉన్న రాజశేఖర్ కూడా తన ఇద్దరు కూతుళ్లను నటన దిశగా ప్రోత్సహించారు. 

పెద్ద కూతురు శివాని .. చిన్న కూతురు శివాత్మిక ఇద్దరూ కూడా తమకి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నారు. శివాత్మిక తాజా చిత్రంగా రూపొందిన 'పంచతంత్రం' రేపు విడుదలవుతోంది. ఇక శివాని చేసిన 'విద్య వాసుల అహం' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. నెల రోజుల తేడాతోనే ఇద్దరి సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ ఇద్దరూ వెబ్ సిరీస్ ల పట్ల కూడా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండటం విశేషం.

More Telugu News