హెడ్ సెట్ లో ఎయిర్ ప్యూరిఫయర్.. డైసన్ కొత్త ఆవిష్కరణ
- చెవులు, ముక్కు, నోరు కప్పి ఉంచేలా డిజైన్
- దీని ధర సుమారు రూ.78 వేలు
- జనవరిలో చైనాలో విక్రయాలు
- అమెరికా, బ్రిటన్, సింగపూర్ లో మార్చి నుంచి అమ్మకాలు
డైసన్ జోన్ హెడ్ సెట్ ధర సుమారు 949 డాలర్లు. అంటే మన రూపాయిల్లో రూ.78వేలు ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో హెడ్ సెట్ ఉంటుంది. పట్టణాల్లో శబ్ద కాలుష్యం ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఈ హెడ్ సెట్ ధరిస్తే శబ్ద కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు పట్టణాల్లో వాయు కాలుష్యం కూడా ఎక్కువే. ఆ విధంగానూ ఈ హెడ్ సెట్ ఎయిర్ ప్యూరిఫయర్ రూపంలో రక్షణ ఇవ్వనుంది.
ఈ హెడ్ సెట్ లోని మైక్రో ఫోన్లు చుట్టూ ఉన్న శబ్దాలను ఒక సెకనులో 3,84,000 సార్లు వినగలవని డైసన్ చెబుతోంది. మన దేశంలో వాయు, శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగర వాసులకు ఇది ఎంతో ఉపయక్తంగా ఉంటుంది. హెడ్ సెట్ కు ముందు భాగంలో ముక్కు, నోరు కప్పి ఉంచేలా డైసన్ ఎయిర్ ప్యూరిఫయర్ హెడ్ సెట్ ఉంటుంది. దీంతో గాలిని తీసుకున్నప్పుడు అది ఫిల్టరై లోపలికి వస్తుంది.