సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులను ట్రాక్ చేసేందుకు మొబైల్ యాప్ 2.0
- ప్రారంభించినట్టు ప్రకటించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్
- న్యాయాధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేసేందుకు వీలు
- గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి యాప్
అదనపు ఫీచర్లతో యాప్ ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీన్ని ఉపయోగించి న్యాయాధికారులు, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తమ కేసులను ట్రాక్ చేసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. నోడల్ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్ లు, తీర్పులు, దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను.. యాప్ లోకి వెళ్లి పరిశీలించవచ్చని తెలిపారు.