విశాలమైన కళ్లే ప్రత్యేకమైన ఆకర్షణ .. దివ్య శ్రీపాదకి పెరుగుతున్న క్రేజ్!

  • యూట్యూబ్ నుంచి జర్నీ మొదలెట్టిన దివ్య శ్రీపాద 
  • వెబ్ సిరీస్ లతో వచ్చిన గుర్తింపు  
  • ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ 
  • క్రేజ్ పెంచిన 'యశోద' మూవీ 
  • రేపు రిలీజ్ అవుతున్న 'పంచతంత్రం'లోను కీ రోల్  
Divya Sripada Special

వెండితెరపై కనిపించాలనే ఆశ .. హీరోయిన్ గా వెలిగిపోవాలనే కోరిక చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. కానీ తమ ప్రయత్నాన్ని ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలనేదే తెలియదు. యూట్యూబ్ ద్వారా ఈ మధ్య కాలంలో చాలామంది తమ టాలెంట్ చూపిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లోను అవకాశాలను అందుకుంటున్నారు. అలా యూట్యూబ్ నుంచి వెండితెరపైకి వెళ్లిన బ్యూటీనే దివ్య శ్రీపాద. 

యూట్యూబ్ లో షార్టు ఫిలిమ్స్ .. వెబ్ సిరీస్ లు చేసిన దివ్య శ్రీపాద, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. కుర్రాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయింది ఆమె కళ్లు. ఇంత అందమైన కళ్లున్న ఈ అమ్మాయి ఎవరబ్బా అనే సెర్చింగ్ అప్పుడే మొదలైంది.  ఆ కళ్లలోని ప్రత్యేకమైన ఆకర్షణనే ఆమెకి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. నటన విషయంలోనూ వంక బెట్టవలసిన అవసరం లేకపోవడంతో అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

మోడ్రన్ డ్రెస్సుల్లో పట్నం పిల్లగా .. చీరకట్టులో అచ్చు పల్లెటూరు అమ్మాయిలా కనిపించే దివ్య శ్రీపాద, ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ .. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతోంది. ఈ మధ్య కాలంలో చేసిన 'స్వాతిముత్యం' .. 'యశోద' సినిమాలు ఆమెకి మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. రేపు రిలీజ్ కానున్న 'పంచతంత్రం' సినిమాలోను ఆమె చెప్పుకోదగిన పాత్రనే చేసింది. ఈ సినిమాతో ఆమె మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

More Telugu News